మన వార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంగళవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్ నవనీత జగదీశ్వర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
స్టేడియం నిర్మాణ పనులు పరిశీలన
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో క్రీడల అభివృద్ధి కోసం స్టేడియం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. త్వరితగతిన స్టేడియం పనులు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం క్రీడల కేంద్రంగా మారుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.