మహాత్మా నీవు చూపిన బాటలో నడుస్తాం _మాదిరి ప్రిథ్వీ రాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాత్ముడు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంతో పాటు అల్విన్ కాలనీ లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాదిరి ప్రిథ్వీ రాజ్ […]

Continue Reading

ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన […]

Continue Reading

ఆదర్శమూర్తి మహాత్ముడి అడుగుజాడల్లో నడుద్దాం – మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి : ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా గాంధీ గారి 155’వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని బీ.సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముడి విగ్రహానికి కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి స్థానికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో నడుస్తూ శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. అదే […]

Continue Reading

గీతంలో ఘనంగా 155వ గాంధీ జయంతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్-లో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని నిరాడంబరంగా నిర్వహించి, ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ బోధించిన అహింస, సత్యం, సరళతల శాశ్వతమైన వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను గౌరవించే సంస్మరణ వేడుకలుగా దీనిని నిర్వహించారు. ఆయన అహింస తత్వశాస్త్రం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మార్చడమే […]

Continue Reading

గీతమ్ లో స్వచ్చ భారత్ అభియాన్

విద్యార్థులు, వాలంటీర్లను ఉత్సాహపరుస్తూ స్వయంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన దేశ ప్రధాని దార్శనికత, స్వభావ స్వచ్చత సంస్కార స్వచ్చత (ఫోర్ ఎస్) ప్రచారానికి అనుగుణంగా, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో స్వచ్చ భారత్ అభియాన్ ను మంగళవారం చేపట్టింది. స్వచ్చ భారత్ మిషన్ పదో వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 2న మహాత్మా గాంధీ జయంతితో ముగుస్తుంది. దీనిని పురస్కరించుకుని గీతం […]

Continue Reading