ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం మనవార్తలు ,షాద్ నగర్ షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి […]

Continue Reading

దుర్గమ్మకు కానుకగా డైమండ్‌ నెక్లెస్‌

మనవార్తలు ,విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను  కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు.సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, […]

Continue Reading

ధాన్యం కొనుగోలు చేయాలి అని కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం

మనవార్తలు ,మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో టిపిసిసి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పాతబస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ చెప్పటి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించిన దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి గారు, టిపిసిసి […]

Continue Reading

నా ఎదుగుదల సర్వేలు గురుకులం భిక్షే_గురుకుల స్వర్ణోత్సవాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి

మన వార్తలు,సంస్థాన్‌నారాయణపురం:   నా ఎదుగుదలకు సర్వేల్‌ గురుకులం చదువే కారణం.నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు నిర్వహించారు.జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.సర్వేల్‌ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న […]

Continue Reading

గీతం స్కాలర్ అమరావతికి డాక్టరేట్ ‘….

మన వార్తలు ,పటాన్‌చెరు: విషపూరిత రంగులు , వాటి జీవసంబంధ కార్యకలాపాల తొలగింపు కోసం మిశ్రమ లిగాండ్ – ఆధారిత లోహ సేంద్రియ పద్ధతిలో రసాయన సమ్మేళనం మిశ్రమాల సంశ్లేషణ , వర్గీకరణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి . అమరావతిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న […]

Continue Reading

కరోనా థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..?

  దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం […]

Continue Reading

కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

మనవార్తలు ,విజయవాడ: పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి రూ.22.5లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడి, 50 కిలోల ప్రమాదకర రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం […]

Continue Reading

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలి_భట్టి

 మనవార్తలు  , హైదరాబాద్‌: రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే […]

Continue Reading