-బొక్సంపల్లి, జౌకుల పరిధిలో బంగారు నిక్షేపాలు
-కాంపోజిట్ లైసెన్స్ కోసం త్వరలో ఈ-వేలం
అనంతపురం:
రతనాల సీమ రాయలసీమలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది. జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
పైన పేర్కొన్న ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. టన్నుమట్టిలో నాలుగు గ్రాములు ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. ఒక్కో వ్యక్తి లేదంటే సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు అన్వేషించుకునేందుకు లైసెన్స్ ఇస్తారు. పూర్తిస్థాయిలో నిక్షేపాలు గుర్తిస్తే మైనింగ్ లీజు కేటాయిస్తారు. త్వరలోనే ఇందుకు ఈ-వేలం నిర్వహిస్తారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…