మనవార్తలు ,కర్నూల్ :
ఎన్నో దశాబ్దాల కాలంగా వెనుకబడిన రాయలసీమకు నేడు హైకోర్టు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాయలసీమ వాసులుగా హర్షిస్తున్నామన్నారు. ఐతే రాయల సీమ ప్రాంతవాసి ఐన నారా చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ రాయలసీమకు, కర్నూలుకు హైకోర్టును దక్కనీయకుండా మొకలడ్డుతున్నారాన్నారు. రాయల సీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరకుండా అడ్డుపడటం అన్యాయమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వికేంద్రీకరణ కు మద్దతుగా, కర్నూలు లో హైకోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్టీ బీసీ గ్రౌండ్స్ నందు జేఏసీ అధ్వర్యంలో నిర్వహించనున్న రాయలసీమ గర్జన సభకు సంఘీ భావం, మద్దతు తెలుపుతూ ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
రాజకీయాలు రాజకీయవేత్తలు ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని హితవు పలికారు. రాయలసీమ వాసులకు చెందాల్సిన హైకోర్ట్ దక్కకుండా అడ్డుపడడం సబబు కాదని ఆన్నారు. నాడు రాయలసీమ కర్నూలు లో ఉన్న రాష్ట్ర రాజధాని త్యాగం చేశామని, అలాగే ఆంధ్ర ప్రాంత వాసులకు సాగునీటి కోసం రాయలసీమ వాసులు వేలాది ఎకరాల భూములను ఇచ్చారని గుర్తు చేశారు. మన ప్రాంత అభివృద్ధికి వచ్చిన గొప్ప అవకాశాన్ని జారవిడుచు కాకుండా, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ అడ్డుపడకుండా, పార్టీలకు అతీతంగా అందరు ఐక్యంగా, ముక్త కంఠంతో మన భాణిని, వాణిని వినిపించాలని కోరారు. హైకోర్టు సాధన కోసం ఏర్పాటు ఐన, జేఏసీ కి అందరూ మద్దతు పలకాలని, మనందరి భవిషత్తు కోసం ఏకం కావాలని పిలుపు నిచ్చారు. కర్నూలు లో జరిగే రాయల సీమ గర్జన సభలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…