_విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు
మనవార్తలు ,రామచంద్రాపురం:
12వ శతాబ్దంలో సమాజంలో కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. విశ్వ గురు, మహాత్మా బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీరంగూడ నుండి జహీరాబాద్ వరకు ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ట్యాంక్ బండ్ పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు, బసవ భవన నిర్మాణానికి ఎకరా స్థలం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.
నేటి తరానికి బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు అడిగే జగదీశ్వర్ జిల్లా అధ్యక్షుడు సిద్దేశ్వర్ ప్రధాన కార్యదర్శి జయ ప్రకాష్ మరియు మధు శేఖర్ నర్సింలు బీరంగూడ అధ్యక్షుడు బస్వరాజ్ పటాన్చెరు అధ్యక్షుడు శివరాజ్ పాటిల్ ఇస్నాపూర్ అధ్యక్షుడు మర్రి మల్లేష్ అధ్యక్షుడు బిహెచ్ఎల్ అధ్యక్షుడు రాజేశ్వర్ మరియు తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులందరూ పాల్గొన్నారు.
.