మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇటీవల ది ఫార్మా పాఠశాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఫార్మా పాఠశాల మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణతో తాను , తమ అసోసియేట్ ప్రొఫెసర్ కింగ్స్టన్ రాజయ్య అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు తెలియజేశారు . ఫార్మా పాఠశాల అనేది విద్యావేత్తలు , ఫార్మా పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం అనే ప్రధాన ధ్యేయంతో హైదరాబాద్లో ఏర్పాటైన ఉద్యోగ – ఆధారిత ఫార్మా శిక్షణ , నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆయన వివరించారు . ఇది లెఫ్ సెన్సైస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో పాటు తెలంగాణ విద్యార్థులకు రాయితీలను అందించే టాస్క్ ( తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ) ల గుర్తింపు పొందినట్టు తెలిపారు . అంతేకాక , ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఉచిత శిక్షణ , ప్లేస్మెంట్ను కూడా అందిస్తుందన్నారు.
ఈ సౌకర్యాన్ని గీతం ఫార్మసీ విద్యార్థులకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామని , వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే శిక్షణా తరగతులకు కొంతమంది విద్యార్థులను పంపుతున్నట్టు ప్రిన్సిపాల్ తెలియజేశారు . అధునాతన ఫార్మా పరికరాలను వినియోగించడంలో వారి నెపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ శిక్షణ దోహదపడడమే గాక , విద్యార్థుల పని సంసిద్ధతను నిర్ధారిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…