నేషనల్ కరేటే పోటీల్లో ప్రతిభ చాటిన పటాన్ చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

షైనిస్,థర్డ్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ లో పటాన్ చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ చాటా రు.ఈ నెల16 న,హైదరాబాద్, మేడ్చల్ సుమంగళి గార్డెన్ లో జరిగిన జి. ఆర్.మెమోరియల్ షైనిస్,థర్డ్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025.పోటీలలో తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.కరాటే ఛాంపియన్ షిప్ లో పటాన్ చెరు పట్టణములోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు విద్యార్థులు మంచి ప్రతిభ చాటి ఆరుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించగా ఇద్దరు (2 ) కాంస్య పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచారు, ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, కరాటే కోచ్ కొమురయ్యలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రేమ్ శంకర్ దుబే,యాజమాన్యం అభినందిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో కూడా మంచి ప్రతిభ చాటుతున్నారని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎజిఎం రాజగోపాల్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *