_తొలి ఏడాది విద్యార్థులకు అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సూచన
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతమ్లోని విశ్వశ్రేణి మౌలిక వనరులను వినియోగించుకుని, ప్రణాళికాబద్ధంగా సమయాన్ని వెచ్చించి, ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి, చదువుతో పాటు ఇతరత్రా కార్యకలాపాలలో కూడా పాల్గొని అత్యుత్తము పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సూచించారు. ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, ప్రోనీసీ (క్యాంపస్ లెఫ్ట్) ప్రొఫెసర్ గౌతమరావులతో కలిసి బుధవారం గీతన్తో తొలి ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.విద్యార్థులు ఎంచుకున్న రంగానికి మించిన పాఠ్యాంశాలను తాము రూపొందించామని, ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందినవారు. ఆర్కిటెక్చర్, సామాజికశాస్త్రం, మేనేజ్మెంట్, సెర్చ్ పాఠ్యాంశాలను కూడా తమ అభిరుచికి గ్గట్టుగా చదవొచ్చని చెప్పారు. చేరిన కోర్సుకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, తమకు పనికొస్తాయనుకునే వాటన్నింటినీ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
కృత్రిను మేథ రాకతో నూనన ఉపాధికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నప్పటికీ, ఆ జ్ఞానాన్ని సముపార్జించి, దీనినో గొప్ప సదవకాశంగా మలచుకోవాలని భరత్ సలహా ఇచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలో ప్రతి విద్యార్ధి ఆలోచించాలని ఆయన కోరారు.ఇంటర్మీడియెట్ స్థాయిలో లోపించిన సృజనాత్మకత, ఆవిష్కరణలకు తిరిగి దగ్గరయ్యేలా గీతం బోధన, ఇతరత్రా కార్యకలాపాలను రూపొందించినట్టు శ్రీభరత్ చెప్పారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెబుతూ, వాటిలోని అవకాశాలను వివరించారు. చదువును మధ్యలో ఆపిసిన
స్టీవ్ జాబ్స్, కాలిగ్రఫీలో తన శిక్షణను ఉపయోగించి ఆపిల్ బ్రాండ్‌ను నిర్మించడాన్ని ఆయన ఉదహరిస్తూ, తనుకు ఇష్టమైన పనిలో నెపుణ్యం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.. గీతమ్లోని పలు కోర్సులలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులు ఆనందంగా విద్యను నేర్చుకోవాలని, వారి జీవిత ఉద్దేశ్యాన్ని గ్రహించే మార్గాన్ని కనుగొంటారని ఆశిస్తున్నట్టు చెబుతూ గీతం అధ్యక్షుడు ఎం.భరత్ తన సందేశాన్ని ముగించారు.