పెరిగిన విద్యుత్ నిత్యావసర సరుకుల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియలని రాస్తారోకో

Hyderabad politics Telangana

మన వార్తలు, మియాపూర్:

పెరిగిన విద్యుత్ నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలను బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ యు మియాపూర్ డివిజన్లో ఆల్విన్ చౌరస్తా దగ్గర జాతీయ రహదరిని దిగ్బంధం చేయడంచేశారు కార్యక్రమాన్ని ఉదేశించి గ్రేటర్ కార్యవర్గ సభ్యులు మైధం శెట్టి మాట్లాడుతు కరోనాతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మరింత భారం అయిపోయాయి గత రెండేళ్ల కాలంగా కరోనా మహామారితో ప్రజల జీవన ఉపాధి కరువైంది ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో వారిపై అధిక ధరలు పిడుగు పడింది కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు వేలదారి కోట్ల రుణమాఫీ పన్నులను ఉపసంహరించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ద్వారా రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి .

అంతర్జాతీయ మార్కెట్ రూట్ ఆయిల్ ధరలు తగ్గిన సందర్భంలో కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ధనులు తగ్గిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే భారీ మొత్తంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేశారని కేంద్రపైన మండిపడ్డారు. చిల్లర సమస్య అవుతుంది అని బస్ చార్జీలను కూడ రౌండ్ ఫిగర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంచడం శోచనీయం మన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్తు ప్రాజెక్టులు విరివిధిగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం పేద ప్రజలపై భారం మోపడమే. చాలా అన్యామని మైధం శెట్టి రాష్ట్రప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

అనంతరం ఎంసీపీయూ గ్రేటర్ కార్యదర్శి తుకారాం నయక్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం దేశాల ఆధిపత్య పోరులో ఉక్రెయిన్ పై జరుపుతున్న దాడి మూలంగా ఆ ధరలు పెరగడం ఒక కారణమని చెప్తున్నాది భుటకం. అధిక ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంసీపీయూ గ్రేటర్ హైదాబాద్ కమిటీ డిమాండ్ చేస్తున్నాది.ఈ కార్యక్రమంలోగ్రేటర్ కార్యదర్శి కా| తుకారాం నాయక్, ఎంసీపీయూ గ్రేటర్ కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, పల్లె మురళి డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్ డివిజన్కమిటీ సభ్యులు
కే.రాజు,సుల్తానా, ఇంద్ర,శివాని,లక్ష్మి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *