– హాజరైన ప్రముఖులు, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి :
జ్యోతి అంటే వెలుగు అని, అలాంటి జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు.. భేల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన 45 వ యాన్వెల్ డే వేడుకలకు అయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతు టీచర్లు ఒక గోల్ నిర్ణయించుకొని అ దిశగా కృషి చేస్తున్నారని, విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతున్నారని కొనియాడారు. దేశం డ యాభేటీస్ వంటి అనేక రోగాలతో చాలా ఇబ్బందులు ఎదురకొంటుంది. దాన్ని ఆదిగమించడానికి శారీరక శ్రమ,తో కూడిన క్రీడలు అవసరమని, అలాంటి క్రీడల్లోను ఇక్కడి విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, యాజమాన్యం, టీచర్లు అందరూ కల్సి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, విద్యార్థులు జీవితం లో ఎంతో ఎత్తుకు ఎదగాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్టు స్కూల్ గోడల మద్యే దేశ భవిష్యత్తు ఉందని, దాన్ని నిలబెట్టడానికి కృషి చేయాలనీ సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వాళ్లకు బహుమతులు అందజేశారు.
హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాధ్ మాట్లాడుతు మేము చదువుకునే రోజుల్లో జ్యోతి విద్యాలయ ఒక రోల్ మోడల్ గా ఉండేదని తెలిపారు. విశాలమైన ప్లే గ్రౌండ్ తో భేల్ కాలనీ స్కూల్స్ ఉండేవని తెలిపారు. ముసివేసే స్థితిలో ఉన్న ఈ స్కూల్ ను ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ పూర్వ విద్యార్థులను, దాతలు కలిసి స్కూల్ పునరుద్దరణకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. చదువు తో పాటు, విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించినట్లయితే ఎంతో ఎత్తుకు ఎదుగుతారని, మనిషి మనిషి గా నేర్పించాలి. తప్పును తప్పుగా చూపే ధైర్యం టీచర్స్ కు ఉండాలన్నారు. కొన్ని స్కూల్స్ టార్గెట్ గా తయారయ్యాయని, అలాంటి వాటి వలలో పడకూడదని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు.
టీచర్స్ విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించి, అ దిశగా ప్రోత్సహించాలని, దేశం పట్ల గౌరవం నేర్పాలని కోరారు. ఫ్యూచర్ జెనరేషన్ కోసం, ఎన్విరాన్ మెంట్ కోసం హైడ్రా పనిచేస్తుoదని తెలిపారు. కొంచెం తగ్గినంత మాత్రానా పూర్తి గా తగ్గామని కాదని, కబ్జాదారులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ఫాదర్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ, ఎస్ వి. డి. ప్రొవిజనల్ సూపెరియార్ సంతురాజా, ఐ ఎస్ అర్ సూపరిండెంట్ పి. మాధురి, బిఆరెస్ నాయకులు ఆదర్స్ రెడ్డి, భేల్ హెచ్. అర్. జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ సూరన్, ఆరవ రామకృష్ణ, పూర్వ విద్యార్థులు పూర్ణిమ రాఘవేందర్ రావు, రామకృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు.