యువత స్వయం కృషితో ఎదగాలి….
– శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి
పటాన్ చెరు:
యువత స్వయం కృషితో ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించాలని తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బండి హరిశంకర్, శాంతి కుమారుడు బండి రవితేజ కు చెందిన తేజ ట్రేడర్ జాన్సన్ కంపెనీకి చెందిన టైల్స్ షో రూమ్ నుగురువారం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వయం ఉపాధితో ఎదుగుతూ పలువురికి ఉపాధి చూయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, పేట్ బషీర్బాగ్ ఏసిపి రామలింగరాజు, సీఐ రాజు, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం. అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, నాయకులు సపానదేవ్, దేవేందర్ రాజు, గూడెం మధుసూదన్ రెడ్డి, వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సర్పంచ్ దండు నరసింహ, అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, నవ్య శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.