పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత భారీ సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి వందనపురి కాలనీలకు చెందిన యువత భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు ఏనుగు నందివర్ధన్ రెడ్డిల నాయకత్వంలో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువకులందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలిపిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు డిపాజిట్ల కోసం పోటీ పడాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంకిత్ కుమార్, నిఖిల్ యాదవ్, సన్నీ బాబు, వంశీ, సాయి కిరణ్, సిద్దు, కమల్, కార్తీక్, అవినాష్, మల్ల రెడ్డి, గణేష్, శివ, రుత్విక్, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…