మనవార్తలు శేరిలింగంపల్లి :
మియాపూర్ ,హైదర్ నగర్, శంశి గూడ, ఎల్లమ్మ బండ , వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా ఉచిత స్టడీమెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బిజెపి నాయకులు ఆర్ కే వై ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి కుమార్ యాదవ్ పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు తన సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ కే వై సభ్యుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో రవి కుమార్ యాదవ్ ముందుండి నిరుపేద విద్యార్థులకు సహకారం అందించడం అభినందించ వలసిన విషయం అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్ కే వై పౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, సీతారామరాజు, నర్సింగ్ యాదవ్, లక్ష్మారెడ్డి,శ్రీహరి యాదవ్,నర్సింగ్ రావు , శ్రీధర్ గౌడ్ ,పృథ్వి, తోట్ల భరత్, గణేష్ ముదిరాజ్, ఆంజనేయులు, వినోద్ యాదవ్,జె శ్రీను,రాము,రాఘవేంద్ర,యాది, గోవర్ధన్ చారి, శివ,సాయి తదితరులు పాల్గొన్నారు