నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారు

Telangana

– ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారని ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ (ఫ్యాకల్టీ ఆఫ్ లా) ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం పటాన్‌చెరు మండలం ముత్తంగి విశ్వభారతి లా కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె విచ్చేశారు. ముందుగా లా కళాశాల ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… లా అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. విద్యార్థులకు రెగ్యులర్ గా కళాశాల వచ్చి అధ్యాపకుల బోధన వింటే సబ్జెక్టు లపై పట్టు పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అటెండెన్స్, డిసిప్లేన్ ముఖ్యమని ఆమె తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చదవడం చాలా అవసరమని, రోజు రీడింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాయర్-అడ్వకేట్కు మధ్య తేడా ఏందో వివరించారు.అనంతరం ఆమె అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.అన్నిటిలో చురుగ్గా ఉంటే విజయం సాధిస్తారని చెప్పారు. జై భీమ్ సినిమా గురించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అధ్యాపకుల బృందం ముఖ్య అతిథిని సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష, రమ్య, కీర్తి అన్వి, పూనం, లా మొదటి సంవత్సరం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *