గీతమ్ లో ప్రపంచ నీటి దినోత్సవం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ నీటి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ‘శ్రేయస్సు, శాంతి కోసం జలం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.ఉమాదేవి మాట్లాడుతూ, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల వంటి పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో నీటి సంరక్షణ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. నీటి కొరతను పరిష్కరించడానికి అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించడానికి సనుష్టి కృషి అవసరమని ఆమె నొక్కి చెప్పారు. సానురస్యాన్ని పెంపొందించడంలో, శ్రేయస్సును సృష్టించడంలో, భాగస్వామ్యు సవాళ్లకు స్థితిస్థాపకతను పెంపొందించడంలో నీటి పాత్ర అమూల్యమైనదన్నారు.

రుద్రారం ఉన్నత పాఠశాలలో అవగాహనా కార్యక్రమం:

రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టీ.బీ. పాత్రుడు, తోటి ఆధ్యాపకులు, బీఎస్సీ విద్యార్థులతో కలిసి డాక్టర్ ఉమ రుద్రారం ఉన్నత పాఠశాలలో నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి వనరులను కాపాడుకోవడంలో తను నిబద్ధతను ప్రదర్శించేలా విద్యార్థులు, అధ్యాపకులు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించి, నీటి సంరక్షణపై మరింత అవగాహన కల్పించేందుకు గోడ పత్రిక రూపకల్పన పోటీలు, ముఖానికి రంగులు వేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతల ప్రతిభను గుర్తించడంతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలలో వారంతా చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు గాను బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.సుస్థిరమైన నీటి నిర్వహణ, అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించే దిశగా పనిచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *