Telangana

గీతంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మకతను చాటిన విద్యార్థులు

ప్రోత్సహించిన అధ్యాపకులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అందరికీ అవగాహన కల్పించేలా నిర్వహించారు. గీతం స్టూడెంట్ లైఫ్ సహకారంతో, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని అనువర్తిత మనస్తత్వశాస్త్రం (Applied Psychology) విభాగం దీనిని ఏర్పాటు చేసింది. ‘అవగాహనతో ఉండండి, దయతో ఉండండి, మీలాగే ఉండండి’ అనే ఇతివృత్తంతో ఈ మాన సిక ఆరోగ్య కార్యక్రమం 2.0కి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ‘మెరుగైన మనస్సులు, ఆరోగ్యకరమైన జీవితాలు, మరింత దయగల రేపటి రోజు’ అనే దార్శనికతను స్వీకరించి, విద్యార్థులను మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వారి ఆలోచనలు, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి, సహాయక వ్యవస్థ లతో అనుసంధానం కావడానికి, శ్రేయస్సు వనరులను అన్వేషించడానికి, సానుభూతి, పరస్పర మద్దతు సంస్కృతిని పెంపొందించడానికి ప్రోత్సహించింది.

డాక్టర్ ఎం. రెజా, డైరెక్టర్, స్కూల్ ఆఫ్ సైన్స్, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ఇన్ ఛార్జ్ డాక్టర్ శామ్యూల్ థరుల సమక్షంలో, హ్యుమానిటీస్ డీన్ డాక్టర్ రథిన్ రాయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత చొరవతో, సృజనాత్మకంగా, ఎంతో నైపుణ్యంతో దీనిని నిర్వహించినందుకు సైకాలజీ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్ళను సందర్శించారు. విద్యార్థులతో సంభాషిస్తూ, కార్యక్రమాలు, వాటి ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుంటూ, మరింత మెరుగుపరచడానికి విలువైన సూచనలు చేశారు. దీని తరువాత, లలిత, ప్రదర్శన కళల విభాగం అధ్యాపక బృందం, వివిధ విద్యార్థి క్లబ్ లు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య అవగాహన, భావోద్వేగ వ్యక్తీకరణ, ఆత్మపరిశీలన, సామాజిక సంబంధాలను ప్రోత్సహించడానికి రూపొందించిన అనేక రకాల ఆసక్తికరమైన, ముఖాముఖి, సృజనాత్మక కార్యకలాపాలు ఉన్నాయి. వీటిలో మానసిక ఆరోగ్య పజిల్ పీస్ యాక్టివిటీ, మానసిక ఆరోగ్య క్యాసినో, అన్ లాక్ యువర్ మైండ్ మినీ ఎస్కేప్ రూమ్, దాచిన నోట్లతో ఆర్ట్ థెరపీ, క్రాఫ్ట్, ఫోటోబూత్, స్కెచ్ స్టాల్, ఒకటి తీసుకోండి, మరొకటి వదిలేయండి, నిబద్ధత గోడ (కమిట్ మెంట్ వాల్), ధృవీకరణ వాక్యాలు (అఫర్మేషన్ సెంటెన్సెస్), ఒకే ఒక్క కోరిక (వన్ విష్ విల్లో), నా భవిష్యత్తు కోసం ఉత్తరం (లెటర్స్ టు మై ఫ్యూచర్ సెల్ఫ్), మానసిక ఆరోగ్య చెక్-ఇన్ బోర్డు, రంగు విశ్లేషణ, బ్యాడ్జ్ తయారీ, మానసిక అంచనా, మానసిక ఆరోగ్య గళ్ల నుడికట్టు, కోపాన్ని అధిగమించే బెలూన్ పాప్, లాఫింగ్ ఛాలెంజ్ వంటివి ఉన్నాయి. సమిష్టిగా, ఈ కార్యకలాపాలు విద్యార్థులకు వారి భావోద్వేగాలను అన్వేషించడానికి, సమస్యలను ఎదుర్కొనే వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, సానుకూల మానసిక ఆరోగ్య పద్ధతులను అలవర్చుకోవడానికి తోడ్పడ్డాయి.

ఈ కార్యక్రమాన్ని సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ నైటీ జార్జ్, తన సహచర అధ్యాపకుల సహకారంతో సమన్వయం చేశారు. ఈ చొరవ ద్వారా, మానసిక ఆరోగ్యానికి విలువనిచ్చే, సంభాషణలను ప్రోత్సహించే, ప్రతి వ్యక్తి అన్వేషించడానికి, స్వస్థత పొందడానికి, ఇతరులతో మమేకమవ్వడానికి, అభివృద్ధి చెందడానికి సాధికారత కల్పించే సహాయక, సమ్మిళిత ప్రాంగణ వాతావరణాన్ని పెంపొందించాలనే తన నిబద్ధతను గీతం హైదరాబాదు పునరుద్ఘాటించింది.

 

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

13 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago