Telangana

నిరంతర అభ్యసం అవశ్యం: నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో నిరంతర అభ్యాసం అవశ్యమని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలని, శ్రామిక శక్తి పరివర్తన కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విధానాన్ని అవలంబించాలని పరిశ్రమ నిపుణులు సూచించారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) ‘మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం భవిష్యత్తు-దిశా నిర్ధేశం: కార్మిక చట్టాలు, మారుతున్న చట్టాపరమైన పరిస్థితులు’ అనే అంశంపై సోమవారం ప్యానెల్ చర్చను నిర్వహించింది. పరిణామం చెందుతున్న కార్మిక చట్టాలు, చట్టపరమైన అనుపాలన, అనిశ్చితి అంచనా, అభివృద్ధి చెందుతున్న మానవ వనరుల పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి దీనిని లక్ష్యించారు.

ఈ చర్చలో ప్రముఖ ప్యానెలిస్టులు- గెయిన్ సైట్ ఇండియా సీనియర్ డైరెక్టర్-కంట్రీ హెడ్ (హెచ్ఆర్) ఇ.హరిత, కార్య ఐటీ సొల్యూషన్స్ డైరెక్టర్ (హెచ్ఆర్) లెర్నింగ్-గ్రోత్ డాక్టర్ శైలజ, ఇన్ ఫోర్ మాజీ సీనియర్ డైరెక్టర్, హెచ్ఆర్ విభాగాధిపతి బి.అనిల్ కుమార్ పాల్గొన్నారు. కొత్త కార్మిక చట్టాల ప్రభావాలు, హెచ్ఆర్ యొక్క అభివృద్ధి చెందుతున్న పాత్రపై విలువైన పరిశ్రమ అంతర్దృష్టులను వారు పంచుకున్నారు. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించాలని, కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎన్. రేఖ చర్చను ప్రారంభించగా, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ కున్మాన్ మిశ్రా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్యానలిస్టులు ఎంబీఏ, బీబీఏ విద్యార్థులతో కూడా సంభాషించి, వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, కొత్తగా వస్తున్న హెచ్ఆర్ సవాళ్లపై ఆచరణాత్మక దృక్పథాలను అందించారు. ఈ చర్చ పరిశ్రమ అనుభవాన్ని అందించడంతో పాటు, మారుతున్న పని ప్రపంచంలో బాధ్యతాయుతమైన నాయకత్వం, వ్యూహాత్మక ఆలోచన, అవగాహనతో కూడిన హెచ్ఆర్ పద్ధతుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

13 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago