గీతమ్ లో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవ వేడుకలు

Telangana

_సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన 23 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యునూనిటీస్లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనదేశంలోని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉద్భవించిన భారతీయ శాస్త్రీయ కళ అయిన కూచిపూడి నృత్య రూపానికి విద్యార్థులు నీరాజనాలర్పించారు. 2020లో ప్రారంభించిన ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న కూచిపూడి గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఈ వేడుకలలో 23 నుంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం బ్రహ్మాంజలి, జతిస్వరం సహా విశేషమైన ప్రదర్శనల మేళవింపుతో సాగింది. కూచిపూడి చరిత్ర, సారాంశం, ప్రాముఖ్య, తను పరిశోధించే పది నిమిషాల చలనచిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ శాస్త్రీయ కళ ఆనందం. తాండనాన్ని ఈ సంక్షిప్త చిత్రం విపులీకరించింది.

ఈ వెంపటి పెద సత్యం ఒక తెలుగు చలనచిత్రం కోసం మొదట కొరియోగ్రఫీ చేసిన ‘ఏరువాక సాగారో’ అనే జానపద సంగీత ప్రదర్శన ఈ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రదర్శన కూచిపూడి గురువులు తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన నిస్వార్థ సేవకు నివాలి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వె.లలిత సింధూరి ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ డాక్టర్ సన్నీ జోస్, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ డీఆర్: చంద్రశేఖర్, ఫెస్ట్ ఆర్ట్స్ విభాగం సమన్వకర్త డాక్టర్ మెథైలి అనూస్ సహా పలువురు విశిష్ట వ్యక్తుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం హెదరాబాద్ లో శాస్త్రీయ నృత్యం యొక్క గొప్ప సంప్రదాయాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది అని డాక్టర్ సన్నీ జోస్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి కళారూపాన్ని సరిరక్షించడం, ప్రచారం చేయడంలో తామూ పాలుపంచుకుంటున్నందుకు గర్విస్తున్నామన్నారు. నందిని, విదుషి, సుప్రీత, ఇందీవర, మధుమిత, ఆన్ మరియా, శృతి, స్పందన, యామిని, అదితి, మాన్విత, భావన, తేజస్వి, తేజశ్రీ, ప్రణవ, పవిత్ర, పూజిత, మనోజ్ఞ, కనిష, భవ్య, హర్షిత, సుకృతి తదితరులు కూచిపూడి నత్యాలను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *