_ముఖ్య అతిథిగా హాజరైన ఇక్రిశాట్ మేనేజర్ ఆత్మీయ అతిథిగా వ్యవసాయ పారిశ్రామికవేత్త
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓటీ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ‘నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్సీనో పిలుపులో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. నీటి-ఒత్తిడి ఉన్న దేశాలలో 2.4 బిలియన్ల ప్రజలు, జం ఆహార వ్యవస్థలపై ఆధారపడిన 600 మిలియన్ల మంది వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించారు. – ఇక్రిశాట్లోని నేల సారవంతం, నీటి నిర్వహణ మేనేజర్ డాక్టర్ పునీత్ చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం కోసం నేల, వీటి నిర్వహణ’ అనే అంశంపై ఉపన్యసించారు.స్థిరమైన నీటి నిర్వహణ ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, సహకార నీటి భాగస్వామ్యం, సమాజంలోని అందరూపాల్గొనడం, శిక్షణ, అవగాహన అవసరమన్నారు. మనదేశంలోని ఉత్తర మొదైనాలలో భూగర్భ జలాల పునరుద్ధరణకు,నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు చిరుధాన్యాల (మిల్లెట్ల) సాగు ఎలా దోహదపడుతుందో అధ్యయనాన్ని ఉటంకిస్తూ డాక్టర్ చౌదరి వివరించారు.
తన కుమారుడితో కలిసి వ్యవసాయ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న బి. జయలక్ష్మి ఆహోరోత్పత్తిలో వైవిధ్యత. -ఆవశ్యకతను వెలుగులోకి తెచ్చారు. ఈ భూమండలం మీదున్న అర మిలియన్ వృక్షజాతులలో కేవలం 30 వేలు మాత్రమే ఆహారం అందిస్తున్నాయని, అందులో కేవలం నాలుగు వంటలు- మొక్కజొన్న, గోధుమ, వరి, సాయా పంటలు 60 శాతం ఆహార అవసరాలను తీరుస్తున్నాయని చెప్పారు. కేవలం ఆ నాలుగింటిపై ఆధారపడకుండా వినియోగంలో లేని వృక్ష జాతులను వెలుగులోకి తేవాల్సిన అశ్యకతను ఆమె వివరించారు.స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఎఫ్ఎస్టి విభాగాధిపతి ప్రొఫెసర్ ఉమామహేశ్వరి కోడి స్వాగతోపన్యాసం చేసి, అతిథులను సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పరుల్ థాపర్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ తరువాత అతిథులతో కలిసి. అధ్యాపకులు, విద్యార్థులు గీతం ప్రాంగణంలో మలబారు వేప మొక్కలను నాటారు.