గీతంలో మాలిక్యులర్ డాకింగ్ పై కార్యశాల

Telangana

ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ అయిన మోల్ సాప్టును ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో లోతైన అవగాహనను కల్పించడంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించినట్టు ఆయన తెలియజేశారు.మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్ పరిచయం, డాకింగ్ మోడల్స్ యొక్క ఆఫ్టిమైజేషన్ అండ్ వాలిడేషన్, డ్రగ్ డిస్కవరీలో రియల్-వరల్డ్ కేస్ స్టడీస్ వంటి ముఖ్య అంశాలపై ఈ కార్యశాలలో తర్ఫీదు ఇస్తామన్నారు.పుణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లో అప్లికేషన్ సైంటిస్ట్ ఆదిత్య మిశ్రా ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా పాల్గొంటారని తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో నిమగ్నమైన నిపుణుల కోసం దీనిని రూపొందించామని, కేవలం 30 మందికి మాత్రమే పాల్గొనే వీలుంటుందని ప్రిన్సిపాల్ స్పష్టీకరించారు.ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ ఎలగందుల సతీష్, 82394 77935, selagand@gitam.edu లేదా డాక్టర్ విన్యాస్ మాయాసా, 99491 23037, vmayasa@gitam.edu లను సంప్రదించాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *