గీతమ్ లో కృత్రిమ మేథపై కార్యశాల

politics

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిము మేథ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రెండు రోజుల జాతీయ కార్యశాలను మార్చి 27-28 తేదీలలో నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ మోతహర్ రెజా సోనువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. కృత్రిమ మేథ, నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎమ్ఎల్ పీ ), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)లో కీలకమైన భావనలు, వాటిని స్వయంగా వినియోగించే విధానంపై ఇందులో పాల్గొనేవారికి సమగ్ర అవగాహన కల్పించడం ఈ వర్క్ షాప్ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. కృత్రిము మేథ, ప్రాథమిక సూత్రాలు, సాంకేతికతలు, ఆధునిక సమాజంలో దాని ప్రాముఖ్యత, వివిధ రంగాలలో వాస్తవ-ప్రపంచ అనువర్తనాలపై లోతైన అవగాహన పొందుతారన్నారు. అంతిమంగా, కృత్రిమ మేథ, ఎల్ఎల్ఎంలను వారి సంబంధిత రంగాలలో సమర్థంగా ప్రభావితం చేయడానికి, ఆవిష్క రణ, సమస్య-పరిష్కార ప్రయత్నాలకు దోహదపడేందుకు అవసరమైన నై పుణ్యాలు పొందే వీలుందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సిబా: ఉద్దత, ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ అనిమేష్ ముఖర్జీ, జియో ప్లాట్ఫారమ్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ డాక్టర్ ఆకాంక్ష కుమార్, ఐఐటీ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ మానేంద్ర శంకర్ దేశార్కర్, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ రాధిక మామిడి, గీతం నుంచి ప్రొఫెసర్ సయంతన్ నుండల్ ప్రధాన వక్తలుగా పాల్గొంటారని తెలిపారు. కృత్రిమ మేథ, డేటా సైన్స్ చదివే బీటెక్/ ఎంటెక్/ ఎమ్మెస్సీ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థుల కోసం ఈ కార్యశాలను రూపొందించామన్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈనెల 26 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల కోసం సమన్వయకర్తలు డాక్టర్ కె.కృష్ణ 99080 85343, డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి 9849317334 0 dkummari(@gitam.edu, mdoodipa@igitam edus

గీతమ్ కు డీఆర్ డీవో పరిశోధనా ప్రాజెక్ట్

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కనక దుర్గా భాస్కర్ యమజాలకు రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో) నుంచి 42.90 లక్షల పరిశోధనా ప్రాజెక్టు మంజూరైంది . ‘ఎన్- మిథెల్ ప్లాయ్- 5- వినెల్ టెట్రాజోల్ ఎనర్జిటిక్ బెండర్ కలిగిన ఆక్సిరేట్ యొక్క సింథటిక్ రూట్ అభివృద్ధి’ చేయడానికి ఈ గ్రాంటును కేటాయించినట్టు తెలియజేశారు.డీఆర్ డీవో పరిశోధనా ప్రాజెక్టును సాధించిన డాక్టర్ భాస్కర్ను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద. సిద్ధవట్టం అభినందించి, గడువులోగా దానిని పూర్తిచేయమని సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *