టైలర్స్ డే వేడుకల్లో గూడెం మధుసూదన్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మేరు (దర్జీ) కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తామని సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. టైలర్స్ డే పురస్కరించుకొని.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో దర్జీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేరు కులస్తుల కోసం గతంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంద్రేశంలో సొంత నిధులతో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోను వారికి పెద్దపీట వేశారని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, అంతిరెడ్డి, చంద్రకుమార్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.