మహిళల సంఘటిత శక్తిని బలోపేతం చేస్తున్న కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
భారతి నగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సమావేశం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళల ఐక్యతకు, సాధికారతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళల నుంచి కొత్తగా మహిళా గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహిళా గ్రూప్ ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశమై సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో పాటు మహిళల అభివృద్ధి, హక్కుల సాధన, సమాజ సేవ లక్ష్యంగా పనిచేయనుందని స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ముందుకు వస్తే సమాజంలో ఎలాంటి మార్పునైనా సాధించగలరని పేర్కొన్నారు. మహిళల ఐక్యతే సామాజిక మార్పుకు పునాదని, మహిళల అభివృద్ధి లేకుండా సమాజ పురోగతి సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. మహిళా శక్తిని ఎప్పుడూ ప్రోత్సహించే నాయకత్వంగా తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని భరోసా ఇస్తూ, కొత్తగా ఏర్పాటైన మహిళా గ్రూప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ సభ్యులు ధ్యానేశ్వరి, శ్రీలతతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

