మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కు చెందిన జేపీ నగర్, ఏమ్ఏ నగర్, టీఎన్ నగర్, చిరంజీవి నగర్, వీడియా కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ప్రగతి ఎన్క్లేవ్, మయూరి నగర్, బీకే ఎన్క్లేవ్ కాలనీలోని వివిధ రంగాల్లో సంగీతం, రాజకీయం, ఆశ వర్కర్స్, సామాజికసేవా, బాలగోకులం, ఫిట్నెస్ కోచెస్, సోషల్ మీడియా, ఐటీ శాఖ, కమ్యూనిటీ సర్వీస్, మరిన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకి అవార్డులను ప్రదానం చేసి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ వారు చేసిన సేవ కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందించారు.ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని కోరారు. మహిళాలకు ఏ అవసరం వచ్చినా అందరికీ అండగా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ టీమ్ సభ్యులు రవి కుమార్, శరత్, వినోద్, వాసు, శ్రీరామ్, రాజేష్, మండూరి,కృష్ణ, వంశీ,సింహాచలం,గురువులు,ప్రవీణ్,నాగ సాయి,చారి,సాయి,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.