మనవార్తలు ,పటాన్ చెరు;
మహిళలను తమ కాల మీద తాము నిలబడేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చిట్కుల్ సర్పంచ్ మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిట్కుల్ కు చెందిన చింత విజయకు ఎన్.ఎం.ఆర్ యువసేన సభ్యులు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరినీ సమదృష్టితో చూసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎవరికీ ఎటువంటి సహాయం కావలసినా తన వంతు సహకారంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు కుట్టు మిషన్ తో కుటుంబానికి చేయూతగా నిలిచేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు పేదల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సేవ చేసేందుకు ముందుకు వస్తానని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.