మనవార్తలు ,పటాన్ చెరు;
రాష్ట్రంలోని మహిళా సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.నాబార్డ్ వారి సౌజన్యంతో ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వృత్తి నైపుణ్యం పెంచేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, నాబార్డ్ డీడీఎం కృష్ణ తేజ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, ఐకెపి డీపీఎం మల్లేశం, ఏపీఎం శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.