మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ మహిళా పక్షపాతి గా పేరొందారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు మంత్రి కేటీఆర్ కు పుష్ప గుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ రావడం సంతోషకరంగా ఉందన్నారు.
మహిళా సంక్షేమంతో పాటు మహిళల భద్రతకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదింటి యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాలకు 2021-2022 సంవత్సరానికి సంబంధించిన 42 కోట్ల 53 లక్షల రూపాయల విలువైన స్త్రీ నిధి రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ చేతులమీదుగా మహిళా సంఘాలకు అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మహిళా ఉద్యోగులు, విద్యార్థినిలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…