– కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహిళలు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలరని విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అన్నారు.గురువారం పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి విశ్వభారతి లా కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవాని మాట్లాడుతూ… ఇంటికి ఇల్లాలే దీపం అనేది పాత మాటని… నేడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదున్నుగా ఉండటమే కాకుండా ఆకాశమే తమవసం కావాలనట్లుగా మహిళలు పాటుపడుతున్నారని కొనియాడారు. సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఉందని అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. లింగ బేధం లేకుండా పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.మహిళా అధ్యాపకులు కళాశాల అభివృద్ధికి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి యొక్క సేవలు తమ కళాశాలకు ఎంతో అభినందనీయమని మహిళా దినోత్సవం సందర్భంగా శాలువ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వర్ష, రమ్య ,కీర్తి, అన్వి, పూనం, తేజశ్రీ, గురుమూర్తి, అంబర్ తదితాలు పాల్గొన్నారు.