వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు
పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటించాడు
ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా పటన్ చేరు అధ్యక్షుడు కోల్కురి నరసింహారెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోటు లేదని పార్టీ అధిష్టానం నిర్ణయాలకు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని.. అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం పై దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు, ఐ ఎన్ పి యు సి జిల్లా అధ్యక్షులు కోలుకూరి నరసింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పటాన్చెరులో ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందని అన్నారు.
పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చిన్న ప్రతి పిలుపులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని జయప్రదం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారి పుటీన రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సిఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారికి నివాళులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో సైతం కాంగ్రెస్ పార్టీ జిన్నారం గుమ్మడి దల నాయకులు సమాచారం అందించి వారితోనే పాల్గొన్నారని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ పార్టీలో చేరడానికి జీర్ణించుకోకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను బలి చేయడం సరికాదని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ మాజీ డైరెక్టర్ ప్రమోద్ ఆతిక్ మాజీ ఎంపీటీసీ వెoకటేష్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు