ఉన్నత ఆలోచనలున్న +2 స్కూళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధం: గీతం అధ్యక్షుడు

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యలో కొత్త ఆలోచనలు, ఉన్నతాశయాలతో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టాలని అభికసించే మాధ్యమిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ చెప్పారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో బుధవారం నిర్వహించిన ‘భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం’ను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు.భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ సీబీఎస్ఈ పాఠశాలలు, ఐబీ స్కూల్స్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఉద్దేశించిన మాట్లాడుతూ, తాము లిబరల్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని , కలిసోచ్చే పాఠశాలలతో కలిసి పయనించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఇటీ రంగంలోని చాలా ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు రానున్న రెండు మూడేళ్లలో కోల్పోతామని, అందువల్ల విద్యార్థుల సంపూర్ణ పరిణితికి బాటలు వేసి లిబరల్ ఎడ్యుకేషన్ వెపు రాము జాతీయ విద్యా విధానం-2020 కంటే ముందు అడుగేసినట్టు చెప్పారు. తమ విద్యార్థులు నైపుణ్యం గలవారిగా ఎదగడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు.

అందుకు అనుగుణంగా పరిశోధన, నాణ్యత గల అధ్యాపకులు, ప్రపంచ శ్రేణి తరగతి గదులు, ప్రగతిశీల వాతావరణాన్ని తమ వర్సిటీలో సృష్టించేందుకు అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నట్టు శ్రీభరత్ చెప్పారు.గీతం ప్రయోగశాలలను సందర్శించమని సదస్సులో పాల్గొన్న ప్రిన్స్ పాళ్లందరికీ ఆయన సూచించారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ద్వారా విధాన నిర్ణయంలో మాస్టర్స్ ప్రోగ్రాము నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి విద్య ఆవశ్యకతను చాటిచెబుతున్నామన్నారు.ఈ సందర్భంగా, ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్స్, స్టెమ్ను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలను అన్వేషించ డంతో పాటు ఉన్నత విద్యలో ఆవిష్కరణలపై ప్యానెల్ చర్చను నిర్వహించారు. ఈఎంఐ సర్వీసెస్ ఇండియా సహ-వ్యవస్థాపకురాలు లక్ష్మీ అన్నపూర్ణ ఈ సందర్భంగా ప్రసంగించారు.తొలుత, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేశారు. వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదిగేందుకు గీతం చేపట్టిన పలు చర్యలను వివరించడంతో పాటు, నచ్చే వేసవిలో విద్యార్థుల కోసం ఉచితంగా సమ్మర్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.గీతమ్ లోని వివిధ స్కూళ్ల డెరైక్టర్లు తాము నిర్వహిస్తున్న కోర్సులు, ఇతరత్రా వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఒకరోజు కార్యక్రమం ఆహ్లాదకరమైన భోజనంతో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *