మనవార్తలు ,అమీన్పూర్
తెలంగాణ ప్రభుత్వములో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది .కానీ దానిని కొందరు నాయకులు, అధికారులు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుక బావి దగ్గర సర్వే నంబర్ 857 లో 1994లో ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చారు ఇండ్ల పట్టాలబ్ధిదారులు అనేకసార్లు ఇల్లు కట్టుకున్న కూల్చివేయడం జరుగుతుందని,ఎంతో కష్టపడి ఇల్లు కకట్టుకుంటే అధికారులు .ముందస్తు నోటీసులు లేకుండా తమ ఇళ్ల నిర్మాణ నిర్మాణాన్ని ఎందుకు కూల్చి వేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునే అర్హత లేదా అని ప్రశ్నించారు.
సర్వేనెంబర్ 857 లో2 ఎకరాల నాలుగు గంటల ప్రభుత్వం భూమి ఉండేదాన్ని దానిని నాయకులు అగ్రకులాల వారు ఆక్రమించుకోవడంతో 37 గుంటల భూమి మాత్రమే ఉందని,అందులో నైనా తమకు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ నీ వేడుకుంటున్నారు . రెవెన్యూ అధికారులు తమపై వివక్ష చూపుతున్నారని, అగ్రవర్ణాలు కట్టుకున్న ఇండ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.ఇకనైనా కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపించి కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని తమకు న్యాయం చేయాలని, లేకపోతే తాము ఆత్మహత్యకైనా సిద్ధమని బాధిత కుటుంబలు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…