బతుకమ్మ పండగపై చిత్తశుద్ధి ఏది?

Districts politics Telangana

_అధికారికంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు

_బతుకమ్మ సంస్కృతిని చాటే విగ్రహంపై మాయమైన బతుకమ్మ

మనవార్తలు ,పటాన్ చెరు:

బతుకమ్మ పండుగ సంబరాలను అధికారికంగా తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్నది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అని జాగృతి వంటి సంస్థలు దేశ, విదేశాల్లో బతుకమ్మ ఆటలు ఆడి మన సంస్కృతిని పరిచయం చేస్తున్నాయి.రాష్ట్రంలో బల్దియాలకు బతుకమ్మ పండుగ ఘనంగా చేసేందుకు నిధులు సైతం మంజూరవుతున్నాయి. సర్కారు బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలు సైతం పంపిణీ చేస్తున్నది. ఇంత విశిష్టత కలిగిన బతుకమ్మ పండుగకు సదాశివపేట అధికారులు సిద్ధం కాలేదు. రూ.6 కోట్ల నిధులతో సదాశివపేటలో 65వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఊబ చెరువును (మినీ ట్యాంక్ బండ్)గా సుందరీకరించారు. మినీ ట్యాంక్ బండ్ పైన తల్లి, కూతురు బతుకమ్మ ఎత్తుకుని స్వాగతం పలుకుతున్న శిలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ శిలా విగ్రహాల తలపై నుంచి బతుకమ్మలు మాయమయ్యాయి. ఆకతాయిలు చేసిన పనిగా భావిస్తున్నారు. నెలలు గడుస్తున్నా తల్లి విగ్రహం తలపై బతుకమ్మ లేకుండానే విగ్రహం దర్శనమిస్తున్నది. తెలంగాణ సంస్కృతిని చాటే బతకమ్మలే గల్లంతైన సంగతి తెలిసినా అధికారులు మరమ్మతు చేసి ఆ విగ్రహంపై కొత్త బతుకమ్మలను ప్రతిష్టించే ఆలోచన చేయట్లేదు. విగ్రహాలను పట్టించుకోకపోవడం మన సంస్కృతిని అవమానించడమేనని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమై ఆడపడుచులు బతుకమ్మలు ఆడుతున్న ఇంకా అధికారులు రంగులు తేలిపోయిన విగ్రహాలకు రంగులు పూసి గల్లంతైన బతుకమ్మ స్థానంలో కొత్త బతుకమ్మలను పెట్టకపోవడం నిరసనలకు కారణం అవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *