పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమణ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే వ్యాపారులకు అమ్ముకుంటున్నాడని ధ్వజమెత్తారు .అమీన్ పూర్ మొయిన్ రోడ్డుపై సర్వే నంబర్ 765, 1016, 1056, 1118, 177 లో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు . భవిష్యత్ లో ప్రజా ప్రయోజనాల పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు,స్టేడియం ఇతర అవసరాల కోసం భూములు దొరికే పరిస్థితిలేదన్నారు .ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూముల్లో పట్టా నెంబర్లు వేసి ఎమ్మెల్యే బ్రోకర్ దందా చేస్తున్నాడంటూ విమర్శించారు.
20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నాడన్నారు. ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఆరువేల కోట్ల విలువ చేసే భూమి అక్రమించుకుంటుంటే అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు . సర్వే నెంబర్ 1056 రెండు ఎకరాల భూమిని లే ఔట్ చేసి వేల కోట్లు స్కాంలో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో వేల కోట్ల అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు .అక్రమార్కులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు . అనంతరం అమీన్ పూర్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్స్ లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, మున్న, నాయకులు సుధాకర్, దుద్యాల రవీందర్, ప్రకాష్, మన్నె రవీందర్, రవి గౌడ్, సత్యనారాయణ, మహేష్, విజయ్, రమేష్, మహిపాల్ రెడ్డి, శంకర్, సిద్దు, భిక్షపతి, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, సతీష్, లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.