అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లేకుండా ఈ దాడులేంటి?: పవన్‌కల్యాణ్‌

Andhra Pradesh politics

అమరావతి ,మనవార్తలు ప్రతినిధి :

ఏపీ అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైకాపాను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..తెదేపా ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలి. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. జీవో నంబర్‌ 1పై చర్చకు స్పీకర్‌ అనుమతించకపోవడం దారుణం. చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇలాంటి దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎంపైనా ఉంటుంది” అని పవన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *