గీతమ్ లో నాడీ వ్యవస్థ యొక్క ఆధ్యాత్మికతపై వెబినార్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నాడీ వ్యవస్థ యొక్క ఆధ్యాత్మికత: ఒత్తిడిని అధిగమించే రహస్య ఆయుధం’ అనే అంశంపై గురువారం వెబినార్ నిర్వహించారు. పంజాబ్ కు చెందిన ఎనర్జీ వెల్ నెస్ పర్పస్ కోచ్ లిప్పీ భల్లా, డాక్టర్ నవీన్ కుమార్ కొట్టాకిలు ఈ వెబినార్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఒత్తిడిని అధిగమించడం, మానవులు, వ్యవహార సరళిపై నాడీ వ్యవస్థ ప్రభావాలపై వారు మార్గనిర్దేశనం చేశారు.నాడీ వ్యవస్థ చిక్కులను లోతుగా పరిశోధించడం, ఒత్తిడి ప్రతిస్పందనలు, పునరుద్ధరణ ప్రక్రియలు. రెండింటినీ ఎలా నియంత్రిస్తుందో పరిశీలించడం లక్ష్యంగా ఈ వెబినార్ సాగింది. ఇందులో పాల్గొన్నవారు నాడీ వ్యవస్థ రెండు ప్రధాన విభాగాల గురించి తెలుసుకున్నారు. మెదడు, వెన్నుపాముతో కూడిన కేంద్రీయ నాడీ వ్యవస్థ (సీఎన్ఎస్), దాని నుంచి సూచనలను అమలుచేసే, అసంకల్పిత శారీరక విధులను నియంత్రించే పరిధీయ నాడీ వ్యవస్థ (పీఎస్ఎస్) అయిన హృదయ స్పందన రేటు, జీర్ణక్రియ వంటి వాటిని గురించి తెలుసుకున్నారు.సానుభూతి నాడీ వ్యవస్థ (ఎస్ఎన్ఎస్), పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ (పీఎన్ఎఎస్) పాత్రలను లిప్పీ భల్లా నొక్కి చెబుతూ, ఎస్ఎన్ఎస్ ‘పోరాడు లేదా పారిపో’ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని, పీ ఎన్ ఎస్ కోలుకోవడం, సమతుల్యాన్ని ప్రోత్సహిస్తూ ‘విశ్రాంతి, జీర్ణం’ను సులభతరం చేస్తుందన్నారు. భావోద్వేగాలు, ఆహారం, ఆలోచనలు, భావాలు నాడీ వ్యవస్థను ఎలా క్లిష్టంగా ప్రభావితం చేస్తాయనే దానిపై లిప్పీ మరింత విశదీకరిస్తూ, ‘మీ మనస్సు భావోద్వేగాలను సృ ష్టించడమే గాక శరీరం ఒత్తిడిని ఎలా నియంత్రిస్తుంది అనే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని చెప్పారు.

శ్వాస ప్రాముఖ్యత లిప్పీ వివరిస్తూ, దానిని భౌతిక శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సు, ఆత్మను కూడా నిలబెట్టే ప్రాణాధార శక్తిగా వర్ణించారు. మన శ్వాసను జాగ్రత్తగా చూసుకోవడం బాహ్య ఉద్దీపనలకు మన నాడీ వ్యవస్థ యొక్క ప్రతిచర్యలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆమె నొక్కి చెప్పారు. ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడం: కోసం ధ్యాన మనస్తత్వం, సానుకూల దృక్పథం, విశ్రాంతి పద్ధతులను నేర్చుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. ఒత్తిడిని తగ్గించడం ద్వారా మనం మరింత ప్రశాంతంగా జీవించగలమంటూ వె బినార్ ను లిప్పీ భల్లా ముగించారు,గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించగా, కార్యక్రమః సమన్వయకర్త డాక్టర్ గటాడి శ్రీకాంత్ వందన సమర్పణ చేశారు. మధ్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నిస్తూ, వారంతా ఈ వె బినార్ లో ఉత్సాహంగా పాల్గొనేలా లిప్పీ భల్లా, డాక్టర్ నరేష్ కుమార్ లు ప్రోత్సహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *