పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ( ఎస్వోఏ ) హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్ ‘ అనే అంశంపై నవంబర్ 26 , 2022 న ( శనివారం ) మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల మధ్య వెబినార్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము ఈ ఏడాది వరుసగా నిర్వహిస్తున్న వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . జహా హదీద్ ఆర్కిటెక్క చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ గణేష్ నిమ్మల ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు . ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl.li/csbjt ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చని , మీటింగ్ గుర్తింపు సంఖ్య : 588 858 3609 , పాస్వర్డ్ : GSoAHyd అని ఆయన వివరించారు . ఇతర వివరాల కోసం అసోసియేట్ ప్రొఫెసర్ కనక ఎన్.రావు ( 98666 19639 ) ను సంప్రదించవచ్చని , లేదా karerapu@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు .
