హైదరాబాద్
వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2021 సాయి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ తాజ్ కఈష్ణలో ఏర్పాటు చేసిన జక్ జువెలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్ తెలిపారు.
దేశంలోని సుప్రసిద్ద అభరణాల వరక్తలు తమ సరికొత్త డిజైనరీ అభరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినట్లు జక్ ట్రేడ్ ఫెయిర్ ఛైర్మన్ జకీర్ అహ్మద్ తెలిపారు. మాస్టర్ పీస్ లు , వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్స్, సఫైర్ ,ముత్యాలు ఇంకా ఇతర అరుదైన సెమీ ప్రెసియస్ స్టోన్స్ , బంగారం ,వెండి, ప్లాటినం, జడౌ అభరణాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయన్నారు.
కోవిద్ 19 భద్రతాప్రమాణాలు పాటిస్తూ ఎగ్జిబిషణ్ నునిర్వహిస్తున్నట్లు జకీర్ అహ్మద్ తెలిపారు. గతంలో నిర్వహించిన ఎక్స్ ఫో లకు హైదరాబాదీయుల నుంచి మంచి స్పందన లభించిందని… ఈ ఎడిషన్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు .