రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తాం – గోదావరి అంజిరెడ్డి

politics Telangana

– కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో బిజెపి లో చేరికలు

మన వార్తలు, శేరిలింగంపల్లి :

రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తామని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం లో గల 111 భారతి నగర్ డివిజన్ లోని హెచ్ ఐ జీ కాలనీ లో బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో పలువురు బిజెపి పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమానికి గోదావరి ముఖ్యాతిధిగా హాజరై పార్టీ లో చేరిన వారికీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రపంచంలోనే దేశం నెంబర్ వన్ గా నిలవడానికి ప్రతీ ఒక్కరి పాత్ర ఉందని, దేశం మొత్తం ఏకమై నరేంద్ర మోడీ ని ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రి ని చేశారని అన్నారు. గతం లో 10 మంది లేని నియోజకవర్గం నేడు ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు కష్ట పడ్డవారు ఈరోజు పెద్ద స్థానం లో ఉన్నారని, వారే మనకు ఆదర్శమని, అదే బాటలో మనం కూడా నడవాలని కోరారు. గతం లో మేము ఓడి నప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నామని, మమ్మల్ని ఎవరు పట్టించుకోరని ఎంపీ గా రఘునందన్ రావు గెలిచాక అన్ని పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హెచ్ ఐ జీ కాలనిలో ఇప్పుడు రోడ్డు వేయడం జరిగిందని, దీనికి చాలా మంది అడ్డుపడ్డారు. కానీ ఎవ్వరు అడ్డొచ్చినా అభివృద్ధిని ఆపలేరని తెలిపారు. వచ్చే నెలలో లింగంపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించనున్నట్లు, త్వరలోనే మెట్రో కూడా రాబోతుందని తెలిపారు. ఎంపీ గెలినప్పుడు రఘునందన్ రావు ఎంపీ అంటే మెట్రో పక్కా అని అన్నారని తెలిపారు. మెట్రో ట్రైన్ ను పటాన్ చెరు వరకు మంజూరు అయిందని, త్వరలోనే సంగారెడ్డి వరకు పొడిగిస్తామన్నారు. రాష్ట్రo లో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పాగా వేయడం పక్కా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని. డివిజన్ లో పార్టీ మరింత బలపడి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఎంతోమంది సీనియర్లు ఓపికగా ఉన్నారని, వాళ్లందరికీ తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు..కృష్ణ మూర్తి చారి మాట్లాడుతు కొన్ని కారణాల వల్ల ఇతర పార్టీ కి పని చేయాల్సి వచ్చిందనీ ఇప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవా పట్టిస్తున్నారని, కొన్ని పార్టీ ల్లో ప్రజలను మాటలతో మభ్య పెట్టారని తెలిపారు. కస్టపడి పనిచేసే పార్టీ బిజెపి పార్టీ అని తెలిపారు. కొందరి చెప్పే మాయ మాటలు నమ్మవద్దనీ. బిజెపి అంటే ఇంటి పార్టీ లా భావించి పని చేస్తున్నారని, దేశం కోసం, జాతి కోసం పని చేస్తాం, ఒకే తాటిపై నిలబడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుందన రజని, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిల్లా రవి, 112 డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, 111 డివిజన్ అధ్యక్షులు నందా రెడ్డి, వీరప్రతాప్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ లో చేరిన వారు శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు బండి యాదగిరి, సునంద, సంగమేష్, అనిత, రాజేందర్ చారి, సాయి వెంకట హర్ష, సుజాత, చారి, శ్రీనివాస్, మధు, సత్యనారాయణ, సుమిత్ర, ఉమా దేవి, కళ్యాణి, జ్యోతి, స్వప్న, గోపాల్, శశి, నర్సింహా చారి, సునీల్, చారి, మల్లారెడ్డి, పవన్ సునీల్, ప్రణీత్ లు పార్టీ లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *