అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేస్తాం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మేరు కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వివిధ కుల సంఘాలకు 1000 గజాల చొప్పున స్థలం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్తులకు తగు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ సంఘానికి 450 గజాల స్థలాన్ని ఇంద్రేశంలో కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇటీవల స్థలం విషయంలో టైలర్స్ అసోసియేషన్, మేరు సంఘాల మధ్య స్వల్ప వివాదం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రెండు సంఘాలకు 225 గజాల కేటాయిస్తానని తెలిపారు. మేరు సంఘానికి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, మేరు మండల కమిటీ. సలహాదారులు, మాజీ అధ్యక్షులు, యువజన సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *