శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అభివృద్ధికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని యెడల సర్వె నంబర్ 100, 101లో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన లో భద్రత కల్పించాలని, మంజీర పైప్ లైన్ మరియు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు..ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోర్దినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, సంజీవ రెడ్డి, మన్నెపల్లి సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి, నడిమింటి కృష్ణ, శంకర్ గౌడ్ ,ప్రభాకర్ గౌడ్ , తుడుము అనిల్ కుమార్, రాములు, యాదగిరి, రవికుమార్ గౌడ్, గిరి, అసిఫ్, సుమన్, సురేష్, రాంబాబు, నరేందర్ ముదిరాజ్, బాలు, నవీన్, ప్రవీణ్, కుమార్ యాదవ్, ,శ్రీకాంత్, సత్యరాజ్, ,రాఘవేంద్ర, నర్సింహ, నరేష్, హరీష్, మహిళలు ప్రియదర్శిని, అనిత, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..