కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తాం :సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

Andhra Pradesh politics Telangana

మనవార్తలు ,డోన్:

కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నక్కి రామన్న భవనంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ పులి శేఖర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారస్తుందని మండిపడ్డారు.బిజెపికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిపి జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. కేరళ, బీహార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సదస్సులో పాల్గొంటారని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అధికారాలపై దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. కొత్త యూనివర్సిటీని స్థాపించి దానికి తన తండ్రి పేరు పెట్టుకోవచ్చుగాని, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసెయ్యడం సరికాదన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ప్రజాదరణ కోల్పోతున్నడన్నారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ మాజీ సీఎం దివంగత జయలలిత పేరును అలాగే కొనసాగిస్తున్నడని, ఆయన ను చూసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా డోన్ పట్టణంలోని రుద్రాక్ష గుటలో 2007 సంవత్సరంలో సిపిఐ ఆధ్వర్యంలో 750 మంది లబ్ధిదారులు ప్రభుత్వ స్థలంలో ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకొని బేస్ మట్టలు, ఇల్లు కూడా నిర్మించుకున్నారన్నారు.తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ,డోన్ ఎమ్మెల్యే రాజారెడ్డి ఆ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పడంతో ఆసుపత్రి నిర్మించుకోవడానికి సిపిఐ నాయకులు ఒప్పుకున్నారన్నారు. అయితే హాస్పటల్ తో పాటు బీసీ ఎస్సీ హాస్టల్ నిర్మాణం కోసం బేస్ మట్టాలను కూడా తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసుకొని నిరుపేదలు అక్కడ బేస్ మట్టాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. అయితే పోలీసులు అడ్డుపెట్టుకొని అక్కడి వెళ్లిన సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు .

_పోలీసులపై డిజిపి కి ఫిర్యాదు చేస్తాం….

శాంతి భద్రత కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి కొమ్ముకాస్తూ సిపిఐ నాయకులపై ప్రజలను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని దీనిపై రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేస్తామని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పేద ప్రజల వైపా లేక అధికారపార్టీ వైపా చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ దగ్గర మెప్పు పొందేందుకు పోలీసులు పేద ప్రజలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను కూల్చేందుకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడికి వెళ్లిన నాయకులను, లబ్ధిదారులను పోలీసుల అరెస్టు చేసి స్టేషన్ తరలించడం సరైన పద్ధతి కాదన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభల్లో మరిన్ని తీర్మానాలు చేసి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ, పి సుంకయ్య ,ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు, సిపిఐ పట్టణ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *