మనం దుర్బలలం, కానీ నిస్సహాయులం కాదు…

politics Telangana

– వల్నరబిలిటీ’పై ఆతిథ్య ఉపన్యాస్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనమందరం దుర్బలులమే, కానీ నిస్సహాయులం కాదని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని యునెస్కో చెర్జ్ ఇన్ వల్నరబిలిటీ స్టడీస్ ప్రొఫెసర్ ప్రమోద్ కె.నాయర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎచ్ఎస్ లోని విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘వల్నరబిలిటీ’ అనే అంశంపె ఉపన్యసించారు. వల్నరబిలిటీ పాఠ్యాంశాలలో పరిశోధన, బోధన, కార్యశాలల నిర్వహణ వంటి పలు రంగాలలో హెదరాబాద్ కేంద్రీయ విద్యాలయంతో కలిసి జీఎసిహెచ్ఎస్ పనిచేయాలన్న నిర్ణయంలో భాగంగా, ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణవాదం, మానవ హక్కులు, చట్టం వంటి అనేక ఇతర విభాగాలతో కూడా వల్నరబిలిటీ మమేకమ్మై ఉందని ప్రొఫెసర్ ప్రమోద్ అన్నారు. అలాగే వాతావరణ మార్పు, ప్రాంతం వంటి భిన్న రంగాలతో కూడా కలగలిసి ఉందన్నారు.

అంటువ్యాధులు, నిరోధక వెర్షన్లు లేదా ఇతర జీవసంబంధమైన విపత్తులకు మానవులు గురవుతారని, ఇవి మన శరీరాలతో పాటు మన భౌతిక వాతావరణంలోని బాహ్య శక్తులకు కూడా హాని కలిగిస్తాయని ప్రొఫెసర్ ప్రమోద్ తెలియజేశారు. అమెరికాలో 70 శాతం కాలుష్యం కలిగించే ప్రమాదకరమైన విష రసాయన వ్యర్థాలను ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలు నివసించే ప్రదేశాలలో ఎక్కువగా డంప్ చేస్తారని చెప్పారు. అలాగే పలు ఐరోపా దేశాలు విచక్షణా రహితంగా రసాయన వ్యర్థాలను నదులలో పారవేయడం వలన, అవి సముద్రాలకు చేరి, చివరకు అలాస్కా వంటి మంచుతో నిండిన ప్రాంతంలోని ఎలుగుబంట్లలో వ్యాధులకు కారకాలవుతున్నాయని చెప్పారు. సోమాలియాలోని బాలలు, సూడాన్లోని మహిళల వల్నరబిలిటీని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ ఇన్ఛార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *