వ్యర్థానికి విలువ ఇవ్వగలిగితే వృథా కాదు. డాక్టర్ శ్రీనివాస్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యర్థానికి జీవం పోయగలిగినా లేదా దానికి విలువ ఇవ్వగలిగినా, అది వృథా కాదని వాల్యూ అనేబర్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహిక సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ కేశవరపు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్, స్కూల్ ఆఫ్ సెు గురువారం ‘వెల్త్ అవుట్ ఆఫ్ నేస్ట్’ (చెత్త నుంచి సంపద) పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టిని పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) అంటారని, వ్యర్థాల పునర్వినియోగం లేదా పునరుత్పాదకత చేయాలని ఆయన సూచించారు. మనంవ్యర్థం అనుకునే చాలా పదార్థాలు మరో ఉత్పత్తికి ముడిసరుకు అవుతాయన్నారు. ప్రతి పౌరుడూ వృథానుతగ్గించేందుకు ప్రయత్నించాలని, దానిని సంపదగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆహారాన్నివృథా చేయొద్దని ఆయన ఉద్బోధించారు. దాదాపు 99 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పునర్వినియోగించవచ్చని,విలువైన మూలకాలను వాటిని నుంచి వెలికితీయొచ్చని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ సమన్వయంలో సాగిన బృంద చర్చలో రచయిత, వాల్యూ ఎనేబుల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహికుడు వివేక్ వర్మ, ఎస్ సెషన్స్ వ్యవస్థాపకురాలు చిన్న హెగ్దేలు “వ్యవస్థాపకుడు, స్టార్టప్’ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త స్టార్టప్తో సమానం కాదని, అయితే పారిశ్రామికవేత్తతో స్టార్టప్ సమానమన్నారు. సమస్యను గుర్తించి, దాని పరిష్కారం కోసం నిరంతం : ఆలోచించే మనస్తత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఉంటుందని, దానిని విద్యార్థులు అలవరచుకుంటే. వ్యవస్థాపకులుగా లేదా ఉన్నతోద్యోగులుగా ఎరిగొచ్చని వక్తలు స్పష్టీకరించారు. పారిశ్రామికవేత్త ఆలోచన వైఫల్యం. చెందడంలో తప్పులేదని, కానీ, దాని నుంచి విలువైన పాఠాలు నేర్చుకుని విజయవంతమైన జీవితానికి బాటలు వేసుకోగలగాలని వారు పేర్కొన్నారు.

తొలుత, బీ-స్కూల్ కేస్ స్టడీస్ డెరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్ బి. తన స్వాగతోపన్యాసంలో కార్యశాల లక్ష్యాలను వివరించి, అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజిమెంట్, సెన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పలువురు పాల్గొని, తను సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *