మనవార్తలు- పటాన్ చెరు
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు…ఆదివాసి హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన వీరుడు కొమరం భీం అని సంగారెడ్డి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సతీష్జిల్లా అధ్యక్షుడు ,కోశాధికారి జగదీశ్, పఠాన్ చేరు బీఎస్పీ కన్వీనర్ వినయ్ కుమార్ అన్నారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో కొమరం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.గిరిజనులకు పోడుభూములు అందేలా పోరాడారని.. అడవి బిడ్డల గుండెల్లో కొలువైన కొమరం భీం జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవ, జిల్లా ఈసీ మెంబర్ లంబాడి నర్సింహ,పటాన్ చెరు కన్వినర్ కిరణ్ కుమార్,అమీన్పూర్ కన్వినర్ చంద్రశేఖర్,తెల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ దర్శన్, పటాన్ చెరు డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్, చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్యాం, రామచంద్రాపురం సెక్టార్ ప్రెసిడెంట్ బాల్ రాజ్, సెక్టార్ కమిటీ సభ్యులురమేష్, తెల్లాపూర్ సెక్టార్ ప్రెసిడెంట్ శ్యాంసన్, బహుజన ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకట్ రెడ్డి, బీఎస్పీ సీనియర్ నాయకులు జనార్థన్ , సీనియర్ నాయకులు శ్రీశైలం , మధు, మనతాపురం సురేందర్ , గ్రామస్తులు పాల్గొన్నారు
