మనవార్తలు,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపుడి గాంధీ పుట్టినరోజు సంధర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజన్ వివికె హౌసింగ్ సొసైటీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ఇండియా చైర్మన్ మరియు ఎండి విజయ్ కుమార్ మరియు తెరాస సీనియర్ నాయకులు గోపరాజు శ్రీనివాస్ రావు తో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులు పొంది, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుతున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. మా హౌసింగ్ సొసైటీ విస్తరణలో గాంధీ ఆశిష్యులు ఉండాలని, ప్రజల అభిమానాన్ని చురగొని నాణ్యమైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.