మనవార్తలు, శేరిలింగంపల్లి :
హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు.
ఉద్యమ కారులకు న్యాయం జరగాలంటే , కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొంది ,బంగారు తెలంగాణ కావాలంటే ఈటెల రాజేందర్ ను గెలవాలని కోరారు. యావత్ తెలంగాణ ప్రజలు ,సబ్బండ వర్గాలు ,కులాలకు అతీతంగా ,మతాలకు అతీతంగా ,పార్టీ లకు అతీతంగా కోరుకునేది ఒక్కటే ఈటెల ను గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అని, అది హుజూరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ మి బిడ్డ నీ గెలిపించండని ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోంగకండి ,పైసలు ఎన్ని ఇచ్చిన తీసుకోండి ,ఈరోజు ఓటు కు 6 వేలు కాదు 10 వేలు. ఇచ్చినా అవి మన డబ్బులే , ఎవ్వరూ ఏమీ ఇచ్చినా తీసుకొని మీకు అందుబాటు లో ఉండే ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకు మి అమూల్యమైన ఓటు వేసి గెలిపించ గలరని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.