Mayor : వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై జిహెచ్ఎంసి మేయర్ (Mayor) గద్వాల విజయలక్ష్మి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కార్పోరేటర్లు ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
పటాన్చెరు 113వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వర్చువల్ సమావేశంలో డివిజన్లో వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను వివరించారు. దీంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరువు లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని కోరారు కార్పోరేటర్ మెట్టు కుమార్ అడిగిన ప్రశ్నలకు మేయర్ విజయలక్ష్మి సమాధానమిచ్చారు. పటాన్చెరు 113 డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు
ఈ సమావేశంలో శానిటేషన్,చెత్త సేకరణ,వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ,మాన్సూన్ ఎమర్జెన్సీ బృంద నిర్వహణ తదితర అంశాలపై అన్ని డివిజన్ల కార్పొరేటర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది.
పటాన్చెరు 113వ డివిజన్ పరిథి లో జరుగుతున్న అభివృద్ధి, శానిటేషన్ పనులు,చెత్త సేకరణ, నూతన అంతర్గత డ్రైనేజీ నిర్మాణం,వివిధ పనులను మేయర్ గారికి వివరించామన్నారు.దీంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చినట్లు కార్పొరేటర్ కుమార్ తెలిపారు.
Also Read :
