సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి

Telangana

 

సింగపూర్‌ ,మనవార్తలు ప్రతినిధి : సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) ఆధ్వర్యంలో బాల వినాయక పూజలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమంలో ప్రవాస తెలుగువారు ప్రత్యక్షంగా పాల్గొని పరవశించిపోయారు. మహబూబ్‌ నగర్‌కు చెందిన శ్రీ వరసిద్దివినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ జూమ్ ద్వారా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు మరియు మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *