పట్టు వదలని విక్రమార్కుడు ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి

మరికొద్ది రోజుల్లో పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు

కార్యాలయం ఏర్పాటుకు హైకోర్టులో లైన్ క్లియర్  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ

పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

అమీన్పూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు రెవెన్యూ మండలాల రిజిస్ట్రేషన్లు పటాన్‌చెరులోనే

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.పటాన్‌చెరు పట్టణ కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్‌చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించగా 2023లో ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 30 జారీ చేశారు.

సబ్రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం సైతం పటాన్‌చెరులో ఏర్పాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జీవో నెంబర్ 30 అమలు పైన హైకోర్టు స్టే విధించింది. దీంతో పటాన్‌చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు బ్రేక్ పడింది.స్టే ఎత్తివేయాలని కోరుతూ పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగిన ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫలితం లభించింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే డిఆర్ఓ కార్యాలయం కొనసాగించడంతోపాటు పటాన్‌చెరు కేంద్రంగా పటాన్‌చెరు రిజిస్ట్రార్ సబ్ కార్యాలయం సేవలు ప్రారంభించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని హైకోర్టుకు తెలిపారు. దీంతో పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం సేవల ప్రారంభానికి అడ్డంకులు తొలగిపోయాయి.

అతి త్వరలో కార్యాలయం ప్రారంభం

న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో అతి త్వరలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాత్కాలికంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని పాత ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *